ENGLISH

వెబ్‌సిరీస్‌ కోసం బోల్డ్‌గా రెచ్చిపోతా: స్నేహా

02 September 2020-15:00 PM

ఇప్పుడు ఎక్కడ విన్నా వెబ్‌ సిరీస్‌ల గురించే చర్చ జరుగుతోంది. వెబ్‌ కంటెంట్‌కి సెన్సార్‌ లేకపోవడంతో, హద్దులు దాటేస్తున్నారు అందాల భామలు. మేకర్స్‌ కూడా ఆ కంటెంట్‌ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌ అలా వుంది మరి. హాట్‌ కంటెంట్‌కి వ్యూయర్స్‌ నుంచి వస్తోన్న అద్భుతమైన రెస్పాన్స్‌తో.. ‘ఆ టైపు’ కంటెంట్‌ వుంటే చాలన్న భావనతో చాలామంది వున్నారు. ఈ లిస్ట్‌లోకి తాజాగా జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌.. అదేనండీ స్నేహా ఉల్లాల్‌ కూడా చేరిపోయింది.

 

‘ఎక్స్‌పైరీ డేట్‌’ అనే ఓ వెబ్‌సిరీస్‌తో హల్‌చల్‌ చేయబోతోంది ఈ హాట్‌ బ్యూటీ. తెలుగులో ‘సింహా’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలో నటించినా, ఎందుకో స్నేహా ఉల్లాల్‌కి రావాల్సిన స్థాయిలో స్టార్‌డమ్ రాలేదనే చెప్పాలి. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ, తానింకా లైమ్ లైట్‌లో వున్నానని చెప్పుకుంటోన్న స్నేహా ఉల్లాల్‌కి ‘ఎక్స్‌పైరీ డేట్‌’ రూపంలో మంచి ఆఫరే వచ్చినట్లయ్యింది. ‘ఈసారి నా హాట్‌ గ్లామర్‌ సత్తా ఏంటో చూపిస్తా..’ అంటోంది స్నేహా ఉల్లాల్‌. ‘వెబ్‌ సిరీస్‌లను తక్కువగా చూడొద్దు.. అడల్ట్‌ కంటెంట్‌ అనే ముద్ర కూడా వేయొద్దు. ట్రెండ్‌ మారింది. ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టే కంటెంట్‌ తన రూపం మార్చుకుంటుంది..’ అని స్నేహా ఉల్లాల్‌ అభిప్రాయపడింది. ఫేడవుట్‌ అయిపోయిన హీరోయిన్లు, లైమ్ లైట్‌లో వున్న హీరోయిన్లు.. ఇలా అందరూ వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్ళడానికి బలమైన కారణమే వుంది. అదే రెమ్యునరేషన్‌. స్నేహా ఉల్లాల్‌కి కూడా చాలా గట్టిగానే దక్కుతోందట ఈ వెబ్‌సిరీస్‌తో.

ALSO READ: Sneha Ullal Recent Photoshoot