ENGLISH

ప్రెగ్నెన్సీతో యోగాసనాలు వేసిన హాట్‌ బ్యూటీ

22 August 2017-18:43 PM

బాలీవుడ్‌ బ్యూటీ సోహా అలీ ఖాన్‌ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ సోదరి ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈమెకి యోగా అంటే మక్కువ ఎక్కువ. అందుకే ఆ యోగాతోనే ఏదో కొత్తగా చేసి చూపించాలనుకుంది. ప్రెగ్నెన్సీలో యోగా ఫీట్స్‌ చేసి చూపిస్తోంది. ఇటీవలే ప్రెగ్నెన్సీ కారణంగా వచ్చిన బేబీ బంప్‌తో యోగాసనాలు వేసి ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టి, వార్తల్లోకెక్కింది సైఫ్‌ అలీఖాన్‌. లేటెస్ట్‌గా ఇంకో యోగా పిక్‌తో టాక్‌ ఆఫ్‌ ది బాలీవుడ్‌గా మారింది. ఈ పిక్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హీరోయిన్స్‌ నాజూకు శరీరంతో గ్లామర్‌గా స్కిన్‌ షో చేయడమే కాకుండా, ఇలాంటి హెల్త్‌ టిప్స్‌ని కూడా చెప్పడం ఆహ్వానించదగ్గ అంశమే. యోగా ఆరోగ్యానికి చాలా మంచిదనీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో యోగా మరింతగా ఉపయోగపడుతుందని ఆమె అంటోంది. అందుకే సోహా ది స్పెషల్‌. అలాగే యోగా ఆరోగ్యానికి మంచిదని చెప్పడంలోనూ ఓ మంచి మెసేజ్‌ కూడా ఆడియన్స్‌కి పాస్‌ అవుతోంది కదా. అందాల భామ యోగా పాఠాల్ని ఇలా చెప్పేస్తోంటే, పాటించకుండా ఉండగలరా ఎవరైనా? అయితే ఓ చిన్న జాగ్రత్త. వైద్య నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని, నిష్ణాతుల పర్యవేక్షణలో యోగాసనాలు వెయ్యాల్సి ఉంటుందని చిన్నపాటి హెచ్చరిక కూడా చేస్తోంది సోహా అలీ ఖాన్‌. గ్రేటే కదా!

ALSO READ: దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన ఆర్జీవీ