ENGLISH

సోలో బ‌తుకే... ఓటీటీకి బెట‌రు!

31 July 2020-15:00 PM

ఆగ‌స్టు 1 నుంచి థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న నిర్మాత‌ల ఆశ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లింది. అన్ లాక్ 3 లో.. థియేట‌ర్ల రీ ఓపెనింగ్ ప్ర‌స్తావ‌న లేదు. ఆగ‌స్టులోనూ థియేట‌ర్‌ల‌కు తాళాలే. దాంతో ఓటీటీ బేరాలు మ‌రోసారి మొద‌లైపోయాయి. `మీ సినిమాకి ఇంత ఇస్తాం` అంటూ... ఓటీటీ సంస్థ‌లు గాలాలు వేస్తున్నాయి. ఈమ‌ధ్య ఓటీటీలో విడుద‌ల అవుతున్న సినిమాల‌కు మంచి స్పంద‌నే రావ‌డంతో వాతావ‌ర‌ణం ఉత్సాహ‌వంతంగానే క‌నిపిస్తోంది.

 

ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `సోలో బ‌తుకే సో బెట‌రు` చిత్రానికీ మంచి ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. న‌భాన‌టేషా క‌థానాయిక‌గా న‌టించిన చిత్ర‌మిది. సుబ్బు ద‌ర్శ‌కుడు. రూ.25 కోట్ల‌కు కొన‌డానికి ఓ ఓటీటీ సంస్థ ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. బ‌డ్జెట్ తో పోలిస్తే.. రూ.25 కోట్ల‌కు టేబుల్ ప్రాఫిట్ దొరికిన‌ట్టే లెక్క‌. దాంతో నిర్మాత కూడా ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. సాయి తేజ్ న‌టించిన `ప్ర‌తిరోజూ పండ‌గే` సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దాదాపు 30 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింది. అందుకే.. సోలో బతుకేకి ఇంత మంచి ఆఫ‌ర్ ద‌క్కింది. మ‌రి నిర్మాత ఏమంటాడో?

ALSO READ: అల్లూ... జ్ఞాప‌కాల్లో...