ENGLISH

మెగా అల్లుడు: మెగా స్పెషాలిటీస్‌

09 February 2018-08:30 AM

మెగాస్టార్‌ అల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రాకేష్‌శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా సెట్స్‌లోకి తాజాగా మన మెగా హీరోగారి ఎంట్రీ షురూ అయ్యింది.

 

హీరోగా కళ్యాణ్‌దేవ్‌ తనను తాను మేకోవర్‌ చేసుకున్నాడు. మామ చిరంజీవి సూచనల మేరకు హీరోగా సంసిద్ధమయ్యాడు. హ్యాండ్‌సమ్‌ లుక్స్‌, నటనపై ఉన్న ఆశక్తికి ఫ్యామిలీ సపోర్ట్‌ తోడై, తనను హీరోగా ముందడుగు వేసేందుకు సహకరించిందనీ కళ్యాణ్‌దేవ్‌ అంటున్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే, ఈ మధ్యనే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్‌ చిరంజీవి, రాజమౌళి, కీరవాణి.. ఇలా పలువురు సినీ పెద్దల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 

తాజాగా హీరో కళ్యాణ్‌దేవ్‌తో పాటు మరికొందరు కీలకమైన ఆర్టిస్టులతో సినిమా మొదటి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ సినిమాలో కళ్యాణ్‌ సరసన నేచురల్‌ బ్యూటీ మాళవికా నాయర్‌ నటిస్తోంది. 'కళ్యాణ వైభోగమే', 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలతో హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ ఈ మాళవికా నాయర్‌. ఈ సినిమాకి హైఫై టెక్నీషియన్లు పని చేస్తున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' సినిమాకి కెమెరామేన్‌గా పని చేసిన సెంథిల్‌ కుమార్‌ అందులో ఒకరు. ఇలాంటి చాలా చాలా విశేషాలు ఒక్కటి కాదట. సినిమా నిండా బోలెడన్ని ఉన్నాయట.

ఒక్కొక్కటిగా ఆ వింతలు, విశేషాలను వెల్లడి చేయనుందట చిత్ర యూనిట్‌. సినిమా టైటిల్‌ దగ్గర నుండీ, ప్రతీ విషయం ఆశక్తిగా ఉంటుందట ఈ సినిమాకి సంబంధించి. మరి ఏమనుకుంటున్నారు. అక్కడ నటిస్తున్నది చిరంజీవి అల్లుడు కదా. మెగాస్టార్‌ అల్లుడా! మజాకానా!

ALSO READ: ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 ముచ్చట్లు