ENGLISH

శ్రీ‌నువైట్ల‌కు అతి పెద్ద ఛాలెంజ్ అదే!

24 November 2020-09:32 AM

ఎట్ట‌కేల‌కు `ఢీ` సీక్వెల్ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఢీతో మ్యాజిక్ చేసిన మంచు విష్ణు - శ్రీ‌నువైట్ల ల జోడీ మ‌ళ్లీ క‌ల‌సి ప‌నిచేయ‌బోతోంది. దీనికి `డీ అండ్ డీ` డ‌బుల్ డోస్ అంటూ మంచి టైటిల్ కూడా పెట్టారు. శ్రీ‌నువైట్ల‌కు అచ్చొచ్చిన రైట‌ర్ గోపీ మోహ‌న్ ఈ సినిమాకి క‌థ అందించారు. అన్నీ బాగానే ఉన్నాయి. మ‌రి ఈ సినిమాలో శ్రీ‌హ‌రి స్థాయి పాత్ర ఎవ‌రు పోషిస్తారు? అన్న‌దే అస‌లు పాయింటు. `ఢీ`లో శ్రీ‌హ‌రి కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా విజ‌యంలో శ్రీ‌హ‌రి భాగ‌స్వామ్యం మ‌ర్చిపోలేం.

 

ఇప్పుడు `ఢీ` సీక్వెల్ లోనూ అలాంటి పాత్ర‌ని ప్రేక్ష‌కులు ఆశిస్తారు. శ్రీ‌హ‌రి ఇప్పుడు లేరు. ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డం చాలా క‌ష్టం. అలాంటి పాత్ర ఉంటే... అందులో శ్రీ‌నువైట్ల ఎవ‌రిని చూపిస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. శ్రీ‌హ‌రి లాంటి పాత్ర‌ని లేకుండా చేసి, విష్ణుని సోలో హీరోగా పెట్టి ఈ క‌థ న‌డిపించినా ఓకే. కానీ `ఢీ` అంత కిక్ ఉండ‌దు. హీరోని ఢీ కొట్టే పాత్రే లేక‌పోతే.. డీ అండ్ డీ అనే టైటిల్‌కే అర్థం ఉండదు. కాబ‌ట్టి.. శ్రీ‌హ‌రిలా ఓ స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేయ‌డం, దానికి స‌రైన న‌టుడ్ని వెదికి ప‌ట్టుకోవ‌డం శ్రీ‌నువైట్ల‌కు పెద్ద ఛాలెంజ్ గా మారిందిప్పుడు.

ALSO READ: కాజ‌ల్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌... అదిరింది!