ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. గురువారం ఉదయం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి జాన్వీ కపూర్ కూడా వచ్చింది. అన్నట్టు ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అఖండలో బాలయ్య విలన్‌గా శ్రీకాంత్ కనిపించిన సంగతి తెలిసిందే. మరి ఈసారి.. ఎన్టీఆర్ సినిమాలో శ్రీకాంత్ ది పాజిటీవ్ పాత్రనా? నెగిటీవ్ పాత్రనా? అనేది తేలాలి.
నిజానికి ఈమధ్య శ్రీకాంత్ కి మంచి పాత్రలే పడుతున్నాయి. అయితే తగినంత గుర్తింపు మాత్రం దక్కడం లేదు. ఇటీవల విజయ్ సినిమా `వారసుడు`లో ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించాడు శ్రీకాంత్. అది మంచి విజయాన్ని అందుకొంది. కానీ శ్రీకాంత్ కి ఈ సినిమా వల్ల ఒరిగిందేం లేదు. అఖండ అంత పెద్ద హిట్ అయినా... శ్రీకాంత్ కి పెద్దగా నెగిటీవ్ పాత్రలు దక్కలేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో?