ENGLISH

గ్లామ్‌షాట్‌: ఖజురహో శిల్పంలా చందమామ గ్లామర్‌!

09 May 2019-11:30 AM

చూసేకొద్దీ చూడాలనిపించే అందం చందమామది. వయసు పెరుగుతున్నా సొగసు మాత్రం తరిగిపోవడం లేదీ ముద్దుగుమ్మకి. ఆకాశంలోని ఆ చందమామే కుళ్లుకునేలా ఈ నేల మీద చందమామ అందం అంతకంతకూ పెరిగిపోతోందంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. పొగుడుతున్నామనే కాదు కానీ, ఒప్పుకుని తీరాల్సిందే అందాల చందమామకు ఇంకా 16 ఏళ్లే అంటే. ఆ అందంలోని నాజూకుతనం అలాంటిది. ఒకానొక టైంలో చందమామ కెరీర్‌ క్లోజ్‌ అయిపోయిందనుకున్నారంతా.

 

కానీ మళ్లీ రెట్టించిన తాజాదనంతో వెలుగులు విరజిమ్మింది. విరజిమ్ముతూనే ఉంది. చూశారుగా ఆ గ్లామర్‌లోని జోష్‌. సాంప్రదాయ చీర కట్టు అయినా, అల్ట్రా మోడ్రన్‌ దుస్తులైనా చందమామ ఒంటికి అతికినట్లుగా సరిపోతాయి. ఎలాంటి కాస్ట్యూమ్‌ అయినా ఆమె ఒంటిపై మెరిసేందుకు పోటీ పడతాయి. తాజాగా ఎల్లో కలర్‌ సాంప్రదాయ కట్టులో చందమామ అందాలు ముఖ్యంగా ఆ నాభి సౌందర్యం ఖజురహో శిల్పాన్ని తలపిస్తోంది. త్వరలో 'సీత' సినిమాతో కాజల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌ 'క్వీన్‌'కి తమిళ రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. వీటితో పాటు, మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు చందమామ కోసం క్యూలో ఉన్నాయి.

ALSO READ: Kajal Aggarwal Gallery