ENGLISH

పెళ్లి పీట‌లెక్క‌నున్న మ‌రో హీరో

03 February 2021-11:06 AM

టాలీవుడ్ కి మ‌రోసారి పెళ్లి క‌ళ వ‌చ్చేసింది. ఆమ‌ధ్య యంగ్ హీరోలంతా.. పెళ్లి కొడుకులుగా మారి - పెళ్లిళ్ల సీజ‌న్ తీసుకొచ్చారు. ఇప్పుడు మ‌రో యువ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. త‌నే సుమంత్ అశ్విన్‌. ఎం.ఎస్‌రాజు త‌న‌యుడిగా అడుగుపెట్టిన సుమంత్‌... హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. `తూనీగ‌`, `అంత‌కు ముందు - ఆ త‌ర‌వాత‌`, `రైట్ - రైట్‌` లాంటి చిత్రాల్లో న‌టించాడు సుమంత్.

 

తన‌యుడిని హీరోగా నిల‌బెట్టేందుకు ఎం.ఎస్‌.రాజు చాలా ప్ర‌య‌త్నాలు చేసినా నెర‌వేర‌లేదు. ఇప్పుడు సుమంత్.. త‌న క‌థ‌ల్ని తానే సెలెక్ట్ చేసుకుని, త‌న ప్ర‌య‌త్నాలు తానే చేసుకుంటున్నాడు. ఇప్పుడు సుమంత్ కి పెళ్లి కుదిరింద‌ని, దీపిక అనేఅమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో వీళ్లిద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని స‌మాచారం. వీళ్ల‌ది ప్రేమ పెళ్లా? పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మా? అన్న‌ది తేలాల్సివుంది.

ALSO READ: ఆచార్య‌నా... మ‌జాకానా?!