ENGLISH

విక్ర‌మ్‌నీ ఖైదీ నీ క‌లిపేసిన సూర్య‌!

28 May 2022-13:00 PM

ఖైదితో లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు మార్మోగిపోయింది. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా విడుద‌లై, గొప్ప ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాతో లోకేష్ క‌న‌గ‌రాజ్ టాప్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు. ఆ వెంట‌నే... విజ‌య్‌తో `మాస్ట‌ర్‌` తీసి, త‌న‌లోని మాస్ కోణాన్ని చూపించాడు. ఇప్పుడు... క‌మ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ రూపొందించాడు. మ‌రోవైపు.. ఖైదీ 2 ప‌నులు సాగుతున్నాయి.

 

విక్ర‌మ్ లో... సూర్య అతిథి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. అయితే... ఈ విష‌యంలో లొకేష్ ఓ ట్రిక్ ప్లే చేశాడు. `విక్ర‌మ్‌`లో సూర్య క‌నిపించే సీన్‌కీ, `ఖైది 2`లో సూర్య ఎంట్రీకీ లింక్ పెట్టాడ‌ట‌. విక్ర‌మ్ లో క్లైమాక్స్ సీనే.. ఖైదీ 2లో ఫ‌స్ట్ సీన్‌లా డిజైన్ చేశాడ‌ట‌. దాంతో.. ఖైది 2కి ఆటోమెటిగ్గా బ‌జ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేశాడు. విక్ర‌మ్ క‌థ‌కీ, ఖైదీ 2కీ అస్స‌లు సంబంధం లేదు. అయినా స‌రే, ఈ రెండింటినీ సూర్య పాత్ర‌తో తెలివిగా ముడి పెట్టేశాడు. ఆ లింకు ఎలా కుదిరింద‌న్న విష‌యం.. విక్ర‌మ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. జూన్ 3న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతోంది. విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ: ర‌జ‌నీ జీవితాన్ని మార్చిన ఎన్టీఆర్ స‌ల‌హా!