ENGLISH

F3: తొలి రోజు బంప‌ర్ ఓపెనింగ్స్‌

28 May 2022-12:01 PM

ఆర్‌.ఆర్‌.ఆర్‌, కేజీఎఫ్ 2 త‌ర‌వాత‌.. తెలుగులో మ‌రో హిట్ ప‌డ‌లేదు. బ‌డా స్టార్ల సినిమాలు సైతం బోల్తా ప‌డుతున్న త‌రుణం ఇది. ఈ ద‌శ‌లో విడుద‌లైన చిత్రం `ఎఫ్ 3`. ఎఫ్ 2 సూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో ఎఫ్ 3పై అంచ‌నాలు పెరిగాయి. అయితే.... ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈసినిమాకి ఎలాంటి ఆద‌ర‌ణ ద‌క్కుతుందో? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో.. ఎఫ్ 3 విడుద‌లైంది. శుక్ర‌వారం ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ద‌క్కాయి. ఫ‌స్ట్ డే.. ఫ‌స్ట్ షోకి... మంచి టాక్ రావ‌డం క‌లిసొచ్చింది. దాంతో పాటు.. సాధార‌ణ టికెట్ రేట్ల‌కే సినిమా... అంటూ చిత్ర‌బృందం భారీగా ప్ర‌చారం చేసింది. త‌గ్గిన టికెట్ రేట్లు కూడా ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్ గా మారింది. మొత్తాని ఏపీ, తెలంగాణ‌ల‌లో రూ.10 కోట్ల‌కు పైగానే వ‌సూళ్లు సాధించింది. వెంకీ, వ‌రుణ్ కెరీర్‌లో ఇదే రికార్డ్‌! రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్క‌లు ఇంకా తేలాల్సివుంది.

 

 

ఎఫ్ 3.. తొలి రోజు స్కోరు

 

నైజాం రూ.4.1 కోట్లు

 

సీడెడ్ రూ.1.2 కోట్లు

 

ఉత్త‌రాంధ్ర రూ.1.8 కోట్లు

 

గుంటూరు. 0.88 కోట్లు

 

ఈస్ట్ రూ.0.72 కోట్లు

 

నెల్లూరు రూ.0.61

 

ఏపీ, తెలంగాణ క‌లిపి: 10.2 కోట్లు

 

ALSO READ: ర‌జ‌నీ జీవితాన్ని మార్చిన ఎన్టీఆర్ స‌ల‌హా!