ENGLISH

సుశాంత్ సినిమాకి లాభాలే లాభాలు!

25 August 2021-12:21 PM

చిలసౌతో త‌న సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టాడు సుశాంత్. `అల వైకుంఠ‌పుర‌ములో` ఓ కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పుడు `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిల‌ప‌రాదు`తో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈనెల 27న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. అయితే విడుద‌ల‌కు ముందే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లిపోయింది. దాదాపు. 1.5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకుంది.

 

ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల్ని ఆహా 3 కోట్ల‌కు సొంతం చేసుకుంది. హిందీ శాటిలైట్ హ‌క్కుల ద్వారా 2.75 కోట్లు వ‌చ్చాయి. తెలుగు శాటిలైట్ రూపంలో మ‌రో 2.5 కోట్లు ల‌భించాయి. ఆడియో రైట్స్ 15 ల‌క్ష‌లకు అమ్ముడుపోయాయి. ఇలా.. దాదాపు 1.5 కోట్ల లాభం వ‌చ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌.

ALSO READ: చిరుతో ఛాన్స్ కొట్టేసిన అన‌సూయ‌