ENGLISH

మోదీకి లేఖ రాసిన 'సుశాంత్' సోదరి శ్వేతాసింగ్!

01 August 2020-10:13 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశమంతటా కలకలం రేపింది. తన మరణ వార్త మొదట దిగ్బ్రాంతి కలిగించినా.. తన సూసైడ్ వెనక అసలు కారణాల పై మీడియాలో రోజుకో కథనం వస్తుంది. ఇలా జరగటానికి కారణం బాలీవుడ్ లో కూరుకుపోయిన నెపటిజమ్ అనుకున్నారు మొదట్లో.. తరువాత వేరే కుట్ర జరిగిందనీ.. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ను ఆశ్రయించారు. ప్రస్తుతం ముంబై పోలీసులు దీని పై దర్యాప్తు చేస్తున్నారు.

 

అయితే సుశాంత్ తో రిలేషన్లో ఉన్న 'రియా చక్రబర్తి'.. సుశాంత్ పై పలు వార్తలు ప్రచారం చేసిందని.. తన మరణానికి కొన్ని రోజులముందు సుమారు 15 కోట్లు రియా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయని.. సుశాంత్ క్రెడిట్ కార్డులు కూడా రియా తీసుకుందని సుశాంత్ తండ్రి రియా పై కేసు పెట్టాడు. తాజాగా సుశాంత్ సోదరి 'శ్వేతాసింగ్' ప్రధాని మోదీకి ఒక లేఖ రాసింది. తన సోదరుడి పై కుట్ర జరిగిందని.. తమకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరు లేరని.. మీరే మాకు న్యాయం చేయాలని కోరింది. సాక్ష్యాలు తారుమారవకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూడాలని ఆ లేఖలో కోరింది శ్వేతా. మరి దీనిపై మోదీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

ALSO READ: టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన 'జెర్సీ'