ENGLISH

త‌మ‌న్నా సినిమాపై 'క‌రోనా' ఎఫెక్ట్‌

30 October 2020-10:00 AM

క‌రోనా వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ్డాయి. ముఖ్యంగా చిత్ర‌సీమ‌కు. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్లే చాలా సినిమాలు ఆగిపోయాయి. కొన్ని సినిమాల‌కు స్క్రిప్టు ద‌శ‌లో పుల్ స్టాప్ ప‌డితే, ఇంకొన్ని సినిమాలు షూటింగ్ జ‌రుపుకుని `రాం.. రాం` చెప్పేశాయి. అలా ఆగిపోయిన సినిమాల జాబితాలో `గుర్తుందా శీతాకాలం` కూడా చేరిపోయింది.

 

తమన్నా క‌థానాయిక‌గా, స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌గా ఈసినిమా ఇటీవ‌లే మొద‌లైంది. పూజా కార్య‌క్రమాల్ని కూడా జ‌రుపుకుంది. అయితే స‌డ‌న్ గా ఈ సినిమా ఆగిపోయింది. దానికి కార‌ణం.. త‌మ‌న్నానే అని టాక్‌. త‌మ‌న్నాకు ఇటీవ‌ల కోవిడ్ సోకిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకుని ఇప్పుడు మ‌ళ్లీ షూటింగుల్లో బిజీ అవ్వాల‌నుకుంటోంది త‌మ‌న్నా. అయితే ముందు అనుకున్న‌ట్టుగా కొన్ని సినిమాల‌కు కాల్షీట్లు కేటాయించ‌లేక, ఒక‌ట్రెండు సినిమాల్ని వ‌దులుకోవాల‌నుకుంద‌ట‌. అందులో భాగంగా `గుర్తుందా శీతాకాలం` సినిమా చేయ‌న‌ని చెప్పింద‌ని తెలుస్తోంది. త‌మ‌న్నా లేక‌పోవ‌డంతో మొత్తంగా ఈ ప్రాజెక్టే ఆపేయాల‌ని నిర్మాత‌లు భావించారు. అందుకే ఈ సినిమా ఆగిపోయింది.

ALSO READ: ప్ర‌భాస్ సినిమాకి ఊహించ‌ని ఎదురు దెబ్బ‌