ENGLISH

మిల్కీ బ్యూటీ.. అప్పుడలా, ఇప్పుడిలా.!

22 December 2020-09:30 AM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పుట్టినరోజు నేడు. 'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, 'హ్యాపీడేస్‌' తదితర సినిమాలతో క్రమంగా పాపులారిటీ పెంచుకుంది. తెలుగునాట స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపుగా అగ్రహీరోలందరి సరసనా నటించింది.. మంచి విజయాల్నీ అందుకుంది. విజయాల్నీ, పరాజయాల్నీ చవిచూసిన తమన్నా, ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా తన రేంజ్‌ని కాపాడుకుంటూనే వుంది. 'తమన్నా పనైపోయింది..' అనే చర్చ ఎన్నిసార్లు సినీ పరిశ్రమలో జరిగినా, అన్నిసార్లూ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది.

 

ఇక, తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను 'మిల్కీ బ్యూటీ' అని అందరూ పిలవడాన్ని ఆక్షేపించింది. రంగుని చూసి, అలా పిలవడం సబబు కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తమన్నా చెప్పుకొచ్చింది. కానీ, సెలబ్రిటీల్ని ఆయా పేర్లతో అభిమానులే పిలుచుకుంటారు. 'మెగాస్టార్‌' అని చిరంజీవిని అభిమానులే పిలుచుకుంటారు. 'చిరూ' అన్న పిలుపు ముందు, మెగాస్టార్‌.. అన్న పిలుపు చిరంజీవికి అంత కిక్‌ ఇవ్వదు.. ఆ విషయాన్ని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు కూడా.

 

అయితే, వర్ణ వివక్ష వివాదాల నేపథ్యంలోనే బహుశా తమన్నా 'మిల్కీ బ్యూటీ' అన్న ట్యాగ్‌లైన్‌ని వదిలించుకోవాలనుకుంటోందేమో. ఆమె వదిలించుకోవాలన్నా వదిలిపోయే ట్యాగ్‌ కాదది. ప్రస్తుతం 'సీటీమార్‌', 'గుర్తుందా శీతాకాలం' తదితర సినిమాలతో బిజీగా వుంది తమన్నా.

ALSO READ: Tamannaah Latest Photoshoot