ENGLISH

వావ్... రాఘ‌వేంద్ర‌రావు హీరోగానా?

23 November 2020-11:45 AM

రాఘ‌వేంద్ర‌రావుని అంతా మౌన ముని అంటారు. ఎందుకంటే.. కెమెరా ముందుకొచ్చి, మాట్లాడ‌డానికే ఆయ‌న‌కు సిగ్గెక్కువ‌. అందుకే ఇంట‌ర్వ్యూలు కూడా ఎప్పుడూ ఇచ్చింది లేదు. ఈమ‌ధ్యే రాఘ‌వేంద్ర‌రావు.. మాట్లాడ‌డానికి అల‌వాటు ప‌డ్డారు. ఇప్పుడు ఏకంగా కెమెరా ముందుకొచ్చి న‌టించ‌బోతున్నార‌ని టాక్‌. రాఘ‌వేంద్రరావు ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. దీనికి త‌నికెళ్ల భ‌రణి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

 

క‌థ సిద్ధ‌మైంద‌ట‌. ఇదో ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మ‌ని, ఇందులో రాఘ‌వేంద్ర‌రావు పాత్ర చాలా హుందాగాసాగుతుంద‌ని స‌మాచారం. `మిథునం`తో త‌నికెళ్ల భ‌ర‌ణి ఓ ప్ర‌యోగం చేశారు. కేవ‌లం రెండే రెండు పాత్ర‌ల‌తో సినిమా అంతా న‌డిపించేశారు. ఈసారీ అలాంటి ప్ర‌యోగ‌మే చేయ‌బోతున్నార‌ని టాక్‌. మ‌రి ద‌ర్శ‌కేంద్రుడి న‌ట‌న ఎలా ఉంటుందో? ఈసారి త‌నికెళ్ల భ‌ర‌ణి ఎలాంటి ప్ర‌యోగం చేయ‌బోతున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: డ‌బుల్ డోస్ ఇవ్వ‌బోతున్న మంచు విష్ణు