ENGLISH

Taraka Ratna: తార‌క‌ర‌త్న ప‌రిస్థితి ఎలా ఉంది?

28 January 2023-13:26 PM

లోకేశ్ పాద‌యాత్ర‌లో పాల్గొన్న తార‌క‌ర‌త్న సొమ్మ‌సిల్లి ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హార్ట్ ఎటాక్‌కి గుర‌య్యార‌ని వైద్యులు ధృవీక‌రించారు. వెంట‌నే చిత్తూరులోని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈరోజు తెల్ల‌వారుఝామున బెంగ‌ళూరు హృద‌యాల‌య ఆసుప‌త్రికి షిఫ్ట్ చేశారు.

 

ర‌క్త‌నాళాల‌లో 90 శాతం బ్లాక్ అయ్యాయ‌ని వైద్యులు తేల్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో స్టంట్ వేయ‌డం కుద‌ర‌దు. తార‌క‌ర‌త్న షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా చాలా అధికంగా ఉన్నాయ‌ని స‌మాచారం. ఆయ‌న‌కి ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఫ‌ర్వాలేద‌ని వైద్యులు చెబుతున్నా, తార‌క‌ర‌త్న ఇంకా ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. తార‌క‌ర‌త్న ఆరోగ్యం గురించి ఎప్ప‌టి క‌ప్పుడు చంద్ర‌బాబు, బాల‌కృష్ణ తెలుసుకొంటూనే ఉన్నారు. ఎన్టీఆర్ సైతం.. తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఫోన్ చేసి అడిగి తెలుసుకొన్నాడ‌ని స‌మాచారం.

 

ఈ మ‌ధ్యాహ్నం తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై ఓ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. దాన్ని బ‌ట్టి కండీష‌న్‌ని అంచ‌నా వేయొచ్చు. మ‌రోవైపు తార‌క‌ర‌త్న కోలుకోవాల‌ని తెలుగుదేశం అభిమానులు పూజ‌లు చేస్తున్నారు.