ENGLISH

ఖైదీ తర్వాత వీరయ్యేనట

29 January 2023-11:08 AM

చిరంజీవి, రవితేజలం సంక్రాంతి సినిమా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ హన్మకొండలో నిర్వహించారు. ఈ వేడుకలో వీరయ్యని ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డ్ గా ప్రకటించారు నిర్మాత నవీన్ యెర్నేని. ఈ రోజుల్లో సినిమా డిస్ట్రిబ్యుటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితే హిట్ అంటున్నారు. 20 శాతం కమీషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. 20 శాతంకంటే ఓవర్ ఫ్లో వస్తే దీనిని ఏమనాలి ?! ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనాలి’’ అన్నారు.

 

అంతేకాదు.. ఖైదీ తర్వాత చిరంజీవి కెరీర్ లో వీరయ్యే పెద్ద విజయమట.‘’చిరంజీవి గారు ఈ సినిమా ‘ఖైదీ’ అంత విజయం అవుతుందని ఒకసారి మెసేజ్ పెట్టారు. నిజంగా అంత పెద్ద విజయం అవుతుందా అనే చిన్న అనుమానం వుండేది. కానీ నిజంగానే ఖైదీ తర్వాత అంత పెద్ద విజయం వాల్తేరు వీరయ్య అందుకుంది’’ అని చెప్పుకొచ్చారు నవీన్.