ENGLISH

తేజ‌.. ష్‌... స్టోరీస్‌!

08 August 2020-13:52 PM

క‌రోనా స‌మ‌యంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కులంతా వెబ్ సిరీస్ బాట ప‌ట్టారు. ఓటీటీ వేదిక‌ల ద్వారా.. ఆదాయాన్ని సంపాదించే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్ప‌టికే రాంగోపాల్ వ‌ర్మ మూడు సినిమాల్ని విడుద‌ల చేశాడు. మ‌రో మూడు సినిమాలు రెడీ చేశాడు. ఇప్పుడు తేజ కూడా అదే బాట ప‌డుతున్నాడు. తేజ నిర్మాణంలో `ష్‌.. స్టోరీస్‌` అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఇందులో ఆరు లేదా ఏడు ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. వీళ్లంతా తేజ శిష్యులే అని తెలుస్తోంది. 


ఒక్కో ఎపిసోడ్ 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంద‌ని, ఇందుకోసం ఓ ఓటీటీ సంస్థ‌తో టైఅప్ అవుతున్నార‌ని తెలుస్తోంది. తేజ ద‌ర్శ‌కత్వంలో ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందించే ఆలోచ‌న వుంది. అందుకోసం ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు కూడా మొద‌లైపోయాయి. 

ALSO READ: నితిన్ మైండ్ బ్లాక్ చేసిన న‌య‌న్‌