ENGLISH

గ్లామ్‌షాట్‌: ఈషారెబ్బ స్టైలింగ్‌ అదిరిందబ్బా.!

25 April 2019-18:30 PM

తెలుగందాన్ని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదండోయ్‌. చూస్తున్నారుగా ఈ స్టైల్‌లో పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఎంత కైపెక్కిస్తుందో. ఎందుకో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో ఇంకేదో అన్నట్లుగా మన తెలుగమ్మాయిలకు ఆశించిన రీతిలో అవకాశాలు మాత్రం రావు. ఎంతైనా పొరుగింటి పుల్లకూరకు బాగా రుచెక్కువ అనే మాట మన తెలుగు హీరోయిన్స్‌ విషయంలో బాగా వర్తిస్తుంది. 

 

ఎంత అందమున్నా, ఎంత టాలెంట్‌ ఉన్నా, ఆఖరికి గ్లామర్‌కి అవకాశమిచ్చినా కూడా మన తెలుగమ్మాయిలకు అరాకొరా ఆఫర్లే తప్ప, అసలు సిసలు ఆఫర్లన్నీ పొరుగు భాష భామలే తన్నుకెళ్లిపోతున్నారు. ఇక ముద్దుగుమ్మ ఈషా రెబ్బ విషయానికి వస్తే, టాలెంట్‌తో పాటు, గ్లామర్‌కీ పెద్దగా మొహమాటపడదు ఈ అమ్మడు. అవకాశముంటే, సిట్యువేషన్‌ డిమాండ్‌ చేస్తే ఎక్స్‌పోజింగ్‌కీ ఓకే. 

 

అయినా కానీ సరైన ఆఫర్‌ రావడం లేదు. అంత వరకూ చిన్న సినిమాలతో ఆకట్టుకున్న ఈషా రెబ్బ ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది. అయినా, ఆ తర్వాతా చెప్పుకోదగ్గ అవకాశం ఆమె తలుపు తట్టలేదు. కానీ త్వరలోనే ఫ్యాన్స్‌కి ఓ గుడ్‌ న్యూస్‌ చెబుతానంటోంది మన తెలుగమ్మాయి ఈషా రెబ్బ. అదేంటో చెప్పే వరకూ ఇదిగో ఈ స్టైల్‌లో ఈషా అందాల్ని చూసి పండగ చేస్కోండిక.   

ALSO READ: ర‌ష్మిక‌.... ఎంత అడిగితే అంత ఇస్తున్నారు మ‌రి!