ENGLISH

నాగ‌శౌర్య రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం

07 March 2017-13:10 PM

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య త్వ‌ర‌లోనే నిర్మాత‌గా మార‌బోతున్నాడా??  సొంత సంస్థ నుంచి సినిమాలు తెర‌కెక్కించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నాడా??  అవున‌నే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. దాదాపు మ‌న క‌థానాయ‌కులంద‌రికీ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంది. సొంత బ్యాన‌ర్ నుంచి సినిమాలు తీయ‌డం లాభ‌దాయ‌క‌మ‌ని యంగ్ హీరోలు న‌మ్ముతున్నారు. అందుకే... ప్రొడ‌క్ష‌న్‌లో అడుగుపెడుతున్నారు. అందులో భాగంగా నాగ‌శౌర్య కూడా నిర్మాత‌గా అవ‌తారం ఎత్త‌బోతున్నాడ‌ని టాక్‌. త‌న సినిమాలే కాకుండా, బ‌య‌ట హీరోల‌తోనూ సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట శౌర్య‌. హైద‌రాబాద్‌లో ఇటీవ‌లే ఓ ఆఫీసు కూడా తెరిచార‌ని, త‌న కోసం కొత్త క‌థ‌లు వింటున్నాడ‌ని తెలుస్తోంది. సో... నాగశౌర్య పేరు కూడా నిర్మాత‌ల జాబితాలో చేరిపోతోంద‌న్న మాట‌.

ALSO READ: ఇంత కంటే ఫ్లాప్ ఇంకోటి లేద‌ట‌