ENGLISH

దూసుకొచ్చేస్తున్న నక్షత్రం

07 March 2017-13:02 PM

ముద్దుగుమ్మ రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'నక్షత్రం'. ఈ సినిమాలో రెజీనా క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉండబోతోందట. ఈ సినిమానే కాకుండా, రెజీనా చేతిలో చాలా సినిమాలున్నాయి. కానీ ఓ పక్క రెజీనా జోరు తగ్గిపోయింది. ఆమె కెరీర్‌ స్లో అయిపోయింది అని టాక్‌ వినిపిస్తోంది. అలా అనుకున్నవాళ్లు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. తాజాగా సందీప్‌ కిషన్‌తో రెజీనా నటించిన సినిమా 'నగరం' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత వెంటనే 'నక్షత్రం' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కూడా సందీప్‌తోనే రెజీనా జత కడుతోంది. కాగా సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. మరో పక్క బాలీవుడ్‌లో కూడా రెజీనా ఓ సినిమాలో నటస్తోంది. అదే బిగ్‌ బీ ప్రధాన పాత్రలో వస్తోన్న 'ఆంఖేన్‌ 2'. తాజాగా తెలుగులో ఈ ముద్దుగుమ్మ మరిన్ని కొత్త ప్రాజెక్టులు టేకప్‌ చేస్తోంది. నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో రెజీనానే హీరోయిన్‌. దగ్గుబాటి అందగాడు రానాతో కూడా రెజీనా జతకట్టబోతోందని సమాచారమ్‌. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం చారిత్రక కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రంలోనే రెజీనాని హీరోయిన్‌గా తీసుకున్నారనీ తాజా సమాచారమ్‌. ఇలా రెజీనా తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుస అవకాశాలతో జోరుగా దూసుకెళ్లిపోతోంది. 

ALSO READ: Nagaram Movie Latest Trailer | Sundeep Kishan | Regina Cassandra