బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాల ప్రవాహం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ తరవాత.. థియేటర్లు తెరచుకోవడంతో ప్రతీవారం మూడు నాలుగు సినిమాలు వరుస కడుతున్నాయి. ఈవారం కూడా అదే సందడి కనిపించబోతోంది. ఈ వారం ఏకంగా 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో రెండు నేరుగా థియేటర్లలో విడుదల అవుతోంటే - ఓ సినిమా ఓటీటీ బాట పట్టింది.
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాసతో ఆకట్టుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే రోజున సుశాంత్ సినిమా `ఇచ్చట వాహనములు నిలపరాదు` విడుదలకు రెడీగా ఉంది. రెండూ మాస్, యాక్షన్ చిత్రాలే. వీటికి పోటీగా.. ఓ ఎంటర్‌టైనర్ రాబోతోంది. అదే.. `వివాహ భోజనంబు`. కమిడియన్ సత్య ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరో సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సోనీ లో ఈసినిమా స్ట్రీమ్ కానుంది. ఇలా.. ఈ వారం ముక్కోణపు పోటీ చూడబోతున్నామన్నమాట. మరి ఇందులో హిట్ లక్షణాలు ఎవరికి ఉన్నాయో చూడాలంటే.. ఇంకొన్ని గంటలు ఆగితే సరిపోతుంది.
ALSO READ: చిరుతో ఛాన్స్ కొట్టేసిన అనసూయ