ENGLISH

ఓటీటీ కి వచ్చిన వివాదాస్పద సినిమా

06 January 2024-17:25 PM

ప్రజంట్ ఎంత బ్లాక్ బస్టర్ మూవీ అయినా నెల లోపే OTT లోకి  వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వెళ్ళటం మానేసి ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్నారు. అలాంటిది పలు వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన 'ది కేరళ స్టోరీ' మాత్రం ఇప్పటివరకు OTT లోకి రాలేదు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి, ఆ మూవీ గూర్చి  దాదాపు మర్చిపోయిన టైమ్ లో ఇప్పుడు OTT లో స్ట్రీమింగ్ కానుంది.  ఎలాంటి అంచనాలు లేకుండా మలయాళం లో వచ్చి, సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషల్లోకి రిలీజ్ అయ్యింది.


సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన, ఈ మూవీ 2023 మేలో థియేటర్లలో విడుదలైంది. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ నటించిన, ఈ మూవీ  ఇండియాలో దాదాపు 250 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాకపోతే ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఈ సినిమా తీశారంటూ పలు వివాదాలను కూడా ఎదుర్కొంది. ఈ చిత్రం A సర్టిఫికేట్ నుంచి  U/A రీసెన్సార్ ను పొందిందని, కొన్ని సీన్లను ట్రిమ్ చేశారని తెలుస్తోంది.


ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో జనవరి 12  లేదా 19వ తేదీ నుంచి 'ది కేరళ స్టోరీ '  స్ట్రీమింగ్ కానుందని సమాచారం. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'ది కేరళ స్టోరీ' ఓటీటీలో కూడా  అదే మ్యాజిక్ ను చేస్తుందో లేదో చూడాలి. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అని తెలిసి సినీ ప్రియులు సంతోషిస్తున్నారు.