ENGLISH

మళ్ళీ తమిళ హీరోనే నమ్ముకున్న వెంకీ అట్లూరి

05 January 2024-15:38 PM

టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ‘సార్’ మూవీతో పలువుర్ని ఆకర్షించాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ధనుష్, సంయుక్తా మీనన్ నటించిన ఈ మూవీని మంచి మెసేజ్‌ తో పాటు కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా వెంకీ తెరకెక్కించారు. తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దుల్కర్ సాల్మన్ తో అన్న ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు విక్రమ్ తో ఓ మూవీకి కథ రెడీ చేసి పెట్టుకున్నాడని సమాచారం.
 

విక్రమ్ నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు స్టార్ హీరోలకి ఉన్నంత క్రేజ్ విక్రమ్ కి కూడా ఉంది. తమిళ సూపర్ హిట్ మూవీస్ తో అన్ని భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్ . పాత్రకి అనుగుణంగా ఎలా కావలంటే అలా ఇమిడిపోయే తత్త్వం విక్రమ్ కి ఉండటం వలన, ప్రయోగాలు చేసే డైరక్టర్స్ మొదటి చాయిస్ విక్రమ్ అనే చెప్పాలి.  విక్రమ్ ప్రస్తుతం తంగలన్ అనే ఒక డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యం లో కొత్త కథలు వింటున్నాడని, వెంకీ, విక్రమ్ ని కలిసి స్టోరీ వినిపించినట్టు,  విక్రమ్ ఒకే  చెప్పినట్టు టాక్.


ఈ మూవీ చాలా వైవిధ్యంగా ఉండనుందని, స్క్రిప్ట్ వర్క్ మొత్తం రెడీ అని, తెలుస్తుంది. ఈ సినిమాతో సక్సెస్ కొడితే వెంకీ తమిళంలో కూడా స్టార్ డైరక్టర్ గా గుర్తింపు పొంది మరిన్ని అవకాశాలు అందుకుంటాడేమో చూడాలి.