ENGLISH

బాప్ రే... ఒకే క‌థ‌తో రెండు సినిమాలు

05 November 2021-10:28 AM

మ‌నుషుల్ని పోలిన మ‌నుషులు ఉన్న‌ట్టే.. క‌థ‌ల్ని పోలిన క‌థ‌లు, సినిమాల్ని పోలిన సినిమాలూ వ‌స్తుంటాయి. కాక‌పోతే...ఒకే సీజ‌న్ లో ఒకే క‌థ‌తో రెండు సినిమాలు తెర‌కెక్క‌డం మాత్రం టాలీవుడ్ లో ఇదే తొలిసారి. అదే... `స్టువ‌ర్ట్ పురం దొంగ‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`.

 

ర‌వితేజతో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా చేస్తున్నామని ఇటీవ‌లే అభిషేక్ పిక్చర్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. వంశీ కృష్ణ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు. ప్రీ లుక్ కూడా వ‌దిలేశారు. మ‌రోవైపు బెల్లంకొండ శ్రీ‌నివాస్ `స్టువ‌ర్ట్ పురం దొంగ‌` అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా టైగ‌ర్‌నాగేశ్వ‌ర‌రావు క‌థే. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఓ గ‌జ దొంగ‌. త‌న నిర్వాకాల గురించి, చేసిన దొంగ‌త‌నాల గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెబుతుంటారు. అత‌ని క‌థ‌నే రెండు సినిమాల్లోనూ చూపించ‌బోతున్నారు. బ‌యోపిక్ కాబ‌ట్టి, ఎంత‌మందైనా సినిమాలుగా తీసుకోవ‌చ్చు. కానీ ఒకే సీజ‌న్ లో ఒకే క‌థ‌తో రెండు సినిమాలు రూపుదిద్దుకోవ‌డం మాత్రం టాలీవుడ్ కి కొత్తే. మ‌రి ఈ రెండు సినిమాల్లో ఏది నిల‌బ‌డుతుందో చూడాలి.

ALSO READ: 'పెద్దన్న' మూవీ రివ్యూ & రేటింగ్!