ENGLISH

మనోజ్‌ సరసన అనీషా ఆంబ్రోస్‌

09 March 2017-13:08 PM

మంచు మనోజ్‌ ఇటీవలే 'గుంటూరోడు' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అదే జోరులో మరో కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. అజయ్‌ ఆండ్రూ డైరెక్షన్‌లో తెరక్కెబోతోన్న ఈ సినిమాలో మంచు మనోజ్‌కి జోడీగా అనీషా అంబ్రోస్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ నీలిమా తిరుమల శెట్టి రూపొందించిన 'అలియాస్‌ జానకి' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. పవన్‌ కళ్యాణ్‌తో 'పంజా' సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు నీలిమా తిరుమల శెట్టి. అనీషా ఆంబ్రోస్‌ తృటిలో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాలో ఈ ముద్దుగుమ్మనే మొదట్లో హీరోయిన్‌గా అనుకున్నారు. తర్వాత కాజల్‌ ఆ ప్లేస్‌లోకి వచ్చి చేరింది. పవన్‌ కళ్యాన్‌, వెంకటేష్‌ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'గోపాల గోపాల' సినిమాలో ఈ ముద్దుగుమ్మ జర్నలిస్టు పాత్రలో నటించింది. అయితే తాజా సినిమా మనోజ్‌తో నటించే ఛాన్స్‌ వచ్చినందుకు అమ్మడు చాలా హ్యాపీగా ఫీలవుతోందట. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. పద్మజా ఫిలింస్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎసె.ఎన్‌ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లనుందట ఈ సినిమా. 

ALSO READ: పూరిపై బాల‌య్య గుస్సా..??