ENGLISH

మెగాపవర్‌స్టార్‌ 'మల్టీ' ప్రయత్నం

09 March 2017-16:59 PM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌, విక్రమ్‌లలో ఎవరో ఒకరు ఈ సినిమాలో రామ్‌ చరణ్ తో కలిసి నటిస్తారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. మరో ప్రముఖ హీరోతోనూ మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నారనీ టాక్‌ వినిపిస్తోంది. ఇది మల్టీస్టారర్‌ మాత్రమే కాదు, మల్టీ లింగ్వల్‌ మూవీ అని కూడా చెప్పవచ్చునేమో. ఎందుకంటే తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రం విడుదలవుతుందట. మణిరత్నం సినిమాలంటే వాటికి ఉండే క్రేజే వేరు. ఆయన క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. అందుకే మణిరత్నం సినిమాలో నటించి, నటుడిగా మరింత పరిణతి సాధించాలనుకుంటున్నాడు చరణ్‌. ఈ మధ్యే స్టార్‌ డమ్‌ని పక్కన పెట్టి ప్రయోగాత్మక చిత్రం 'ధృవ'లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చరణ్‌. అలాగే మరో ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అదే సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ చేయబోయే సినిమా. ఇది కూడా విభిన్నమైన చిత్రమే. పల్లెటూరి కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు చరణ్‌ ఈ సినిమాలో. అంతేకాదు ఈ సినిమాలో చరణ్‌ చేయబోయే క్యారెక్టర్‌కి ఇంకా చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయట. ఈ సినిమాలో ముద్దుగుమ్మ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్‌ హీరోగా తెలుగులో మెగా పవర్‌ స్టార్‌ అన్పించుకున్న చరణ్‌ చేయబోయే ఈ నూతన ప్రయత్నాలన్నీ ఫలించాలని కోరుకుందాం. 

ALSO READ: నితిన్ సీక్రెట్ పోలీసా??