ENGLISH

మాజీ హీరోయిన్‌కి క‌రోనా

08 August 2020-13:57 PM

టాలీవుడ్ ని క‌రోనా క‌మ్మేస్తోంది. ప్రముఖ‌ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టులు క‌రోనా బారీన ప‌డ్డారు. క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ఇప్పుడు మాజీ హీరోయిన్ న‌వనీత్ కౌర్ కీ క‌రోనా సోకింది. 


శీను - వాసంతి - ల‌క్ష్మి, శ‌త్రువు, జ‌గ‌ప‌తి లాంటి సినిమాల్లో న‌టించింది న‌వ‌నీత్ కౌర్‌. ఇప్పుడ రాజ‌కీయాల్లో బిజీ. మ‌హారాష్ట్ర‌లోని ఓ నియోజ‌క వ‌ర్గం నుంచి ఎంపీగా ఎన్నికైంది. పార్ల‌మెంటులో న‌వ‌నీత్ చాలాసార్లు త‌న వాగ్థాటిని చూపించింది. అలా.. న‌వ‌నీత్ రాజ‌కీయాల్లోనూ స్టార్ గా ఎదుగుతోంది. ఇప్పుడు న‌వ‌నీత్ క‌రోనా బారీన ప‌డింది. ఈ విష‌యాన్ని అమె ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ‌ప‌రిచారు. ఇటీవ‌ల త‌న‌ని క‌ల‌సిన‌వాళ్లంతా విధిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. త్వ‌ర‌లోనే తాను క‌రోనాని జ‌యించి, సంపూర్ణ ఆరోగ్య వంతురాలిన‌వుతాన‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ALSO READ: ఉమా మ‌హేశ్వ‌ర‌.. భారీ లాభ‌స్య‌