ENGLISH

ఉమా మ‌హేశ్వ‌ర‌.. భారీ లాభ‌స్య‌

08 August 2020-13:55 PM

ఇటీవ‌లే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌`. స‌త్య‌దేవ్ న‌టించిన ఈ చిత్రానికి వెంకటేష్ మ‌హా ద‌ర్శ‌కుడు. స‌త్య‌దేవ్ న‌ట‌న‌, ద‌ర్శ‌కుడు క‌థ‌ని న‌డిపించిన విధానం, నేటివిటీ.. ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేశాయి. మంచి రివ్యూలు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాని మెచ్చుకుంటూ పోస్టింగులు పెడుతున్నారంతా. సినిమా సెల‌బ్రెటీలు ట్వీట్లు చేశారు.


క‌మ‌ర్షియ‌ల్ గానూ ఈ సినిమా లాభాల పంట పండించుకుంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమాకి 1.5 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్టు టాక్‌.  ఈ సినిమా బ‌డ్జెట్ దాదాపు ఓటీటీ ద్వారా వ‌చ్చేసిన‌ట్టైంది. అయితే ఇటీవ‌ల ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని ఈటీవీ సొంతం చేసుకుంది. శాటిలైట్ రూపంలో మ‌రో 1.5 కోట్లు వ‌చ్చాయ‌ని సమాచారం. ఆ లెక్క‌న‌.. శాటిలైట్ ద్వారా వ‌చ్చిందంతా లాభ‌మే అనుకోవాలి. థియేట‌ర్లో విడుద‌ల చేసినా.. ఇంత మొత్తం వ‌చ్చేది కాదేమో..?   నిజానికి ఈటీవీ సినిమాల్ని కొన‌డం లేదు. కాక‌పోతే... ఈ సినిమాపై వ‌చ్చిన బ‌జ్ చూసి. ముందే కొని పెట్టుకుంది. విడుద‌లైన త‌ర‌వాత కొంటే.. నిర్మాత‌ల‌కు మ‌రిన్ని మంచి డ‌బ్బులు వ‌చ్చేవి. 

ALSO READ: బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్మిన వ‌ర్మ‌