ENGLISH

గ్లామ్‌షాట్‌: అందాల త్రిధా స్టైల్‌ అందరికీ నచ్చింది

16 February 2018-13:06 PM

'మనసుకు నచ్చింది' సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ త్రిథా చౌదరి. యంగ్‌ హీరో నిఖిల్‌ సరసన 'సూర్య వెర్సస్‌ సూర్య' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ స్టైల్‌ ఐకాన్‌ అట. మోడ్రన్‌ రంగం నుండి వచ్చిన ఈ బ్యూటీకి డిఫరెంట్‌ స్టైల్స్‌ని ఫాలో చేయడమంటే చాలా ఇష్టమంటోంది. ఎప్పటికప్పుడే ట్రెండీ లుక్స్‌తో కనిపిస్తే చాలా బావుంటుందంటోంది. అలాగే దేవుడిచ్చిన అందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనీ, ఆ అందానికి అప్పుడప్పుడూ అవసరమైన మెరుగులు కూడా దిద్దాలనీ సలహాలు కూడా చెబుతోంది. తాజాగా ఈ ఫోటో చూస్తే వారెవ్వా త్రిథా నీ స్టైల్‌ అదిరిందిలే అనకుండా ఉండలేర. అదే త్రిథా గ్లామర్‌ స్పెషాలిటీ. అంతేకాదు వెరీ వెరీ ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌ ఈ ముద్దుగుమ్మది. అన్ని హావభావాలు ఈజీగా పలికేస్తాయి. ఇప్పుడైతే ఈ వైట్‌ అండ్‌ వైట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌తో వైట్‌ షార్ట్‌ కాస్ట్యూమ్‌లో త్రిధా హాట్‌ హాట్‌ అందాలు తెగ ముద్దొచ్చేస్తున్నాయ్‌లే.

ALSO READ: Qlik Here Latest Photoshoot