ENGLISH

త్రివిక్రమ్‌ మీద ఒత్తిడి పెరిగిపోతోంది

04 May 2018-08:30 AM

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి స్టోరీ ఏంటనేది ఎవ్వరికీ తెలియడం లేదు. సినిమాకి సంబంధించి చాలా గోప్యత పాఠిస్తున్నారు. ఈ సినిమా కథ ఇలా ఉండబోతోందట. అలా ఉండబోతోందట అనే గాసిప్స్‌ తప్ప, అసలు కథా, కథనం ఏంటనేది తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్‌ మీద ప్రెషర్‌ బాగా పెరిగిపోతోందని తెలుస్తోంది. 

'అజ్ఞాతవాసి' పెయిల్యూర్‌తోనే త్రివిక్రమ్‌కి ఈ చిక్కొచ్చి పడింది. లేదంటే, త్రివిక్రమ్‌ ఎప్పుడూ కూల్‌గా కామ్‌గా డైరెక్షన్‌ చేసుకుని పోతాడు. అలాంటిది ఎన్టీఆర్‌ సినిమా విషయంలో చెప్పుకోలేని ప్రెషర్‌ ఫీలవుతున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఫ్యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండబోతోందని ఓ పక్క, కాదు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని మరో పక్క, లేదు లేదు పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీ అని ఇంకో పక్క పలు కథనాలు వెలువడుతున్నాయి. 

ఏది ఏమైనా పక్కా ఎంటర్‌టైనర్స్‌తోనే త్రివిక్రమ్‌ సంచలన విజయాలు అందుకున్నాడు. వాటికి కాస్త కమర్షియల్‌ టచ్‌గా ఫ్యాక్షన్‌ యాక్షన్‌ని వాడుకున్నాడు తప్ప, అంతేకానీ, ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ త్రివిక్రమ్‌ డైరీలో ఇంతకు ముందెన్నడూ ఉన్న దాఖలాలు లేవు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: భారీ విడుదలకి సిద్ధమైన బాహుబలి 2