ENGLISH

అబ్బో.... ఒకేసారి 7 సినిమాలా?

05 August 2021-13:36 PM

సెకండ్ వేవ్ త‌ర‌వాత‌.. మ‌ళ్లీ సినిమాల జోరు మొద‌లైంది. గ‌త వారం.. ఆరు సినిమాలొచ్చాయి. అయితే అంద‌రి దృష్టీ ఇష్క్‌, తిమ్మ‌రుసుల‌పైనే. ఈసారి ఏకంగా 7 సినిమాలు వ‌స్తున్నాయి. అవును... శుక్ర‌వారం ఒక‌టి కాదు, రెండు కాదు... ఏకంగా ఏడు సినిమాలు బ‌రిలోకి దిగ‌బోతున్నాయి. ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం, ముగ్గురు మొన‌గాళ్లు, క్షీర‌సాగ‌ర మ‌థ‌నం, మ్యాడ్, మెరిసే మెరిసే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, రావ‌ణ లంక విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.

 

కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన `ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం`పై అంద‌రి దృష్టీ ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా పాట‌లు ఆల్రెడీ హిట్ట‌య్యాయి. ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా బిజినెస్ కూడా ఎప్పుడో జ‌రిగిపోయింది. ఎన్ని ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా, కాద‌నుకుని... థియేట‌ర్ల కోసం ఎదురు చూశారు. క‌చ్చితంగా హిట్ సినిమా అవుతుంద‌న్న భావ‌న టాలీవుడ్ లో ఉంది. మ‌రి ఆ న‌మ్మ‌కాన్ని ఈ సినిమా ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకుంటోందో చూడాలి. మిగిలిన ఏ సినిమాకీ అంతగా ప్ర‌మోష‌న్లు లేవు. శ్రీ‌నివాస‌రెడ్డి హీరోగా తెర‌కెక్కిన ముగ్గురు మొన‌గాళ్లు ట్రైల‌ర్ బాగున్నా - ఆ సినిమా ప్ర‌చారం విష‌యంలో నిర్మాత‌లు మ‌రీ పిసినారిత‌నం చూపిస్తున్నారు. మిగిలిన సినిమాలూ అంతే. మరి విడుద‌ల‌య్యాక ఏ సినిమా జాత‌కం ఎలా మారుతుందో చూడాలి.

ALSO READ: స్టెప్పులేయ‌బోతున్న ద‌ర్శ‌కేంద్రుడు