ENGLISH

'ఉప్పెన‌'కు నెగిటీవ్ ప‌బ్లిసిటీ మొద‌లైంది

06 February 2021-14:00 PM

ఈనెల 12న విడుద‌ల అవుతున్న ఉప్పెన పై చాలా అంచ‌నాలున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చి ఈసినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం, మెగా కాంపౌండ్ నుంచి.. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డం, కృతి శెట్టి గ్లామ‌ర్ జ‌నాల్ని ఆక‌ట్టుకోవ‌డ‌, దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు సూప‌ర్ హిట్ అయిపోవ‌డం.. ఇలా ఒక‌టేమిటి? ఉప్పెన గురించి చెప్పుకోవ‌డానికి ఎన్నో. అందుకే ఈ సినిమాపై ఇన్ని అంచ‌నాలు. అయితే.. ఇటీవ‌ల విడుద‌లైన `ఉప్పెన` ట్రైల‌ర్‌.. ఈ అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేసేట్టు క‌నిపిస్తోంది.

 

ఎందుకంటే... ట్రైల‌ర్ చూస్తుంటే, సినిమాలో కొత్తగా ఏం ఉండ‌దేమో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ధ‌నిక - పేద మ‌ధ్య ప్రేమ క‌థ‌, ప‌రువు కోసం త‌న్నుకోవ‌డాలూ ఇదే క‌నిపించాయి. అంతేనా? విజ‌య్ సేతుప‌తి పాత్ర‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఆ పాత్ర‌కు ఇచ్చిన డ‌బ్బింగ్ ఘోరంగా ఉంది. విజ‌య్ సేతుప‌తికి అది సూటవ్వ‌లేదు. ఇవ‌న్నీ.. ఈ సిన‌మాపై నెగిటీవ్ ప్ర‌చారం మొద‌ల‌య్యేలా చేశాయి.

 

సినిమాలో ఏదో ఓ స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండి, న‌టుడిగా విజ‌య్ సేతుప‌తి విజృంభించేస్తే త‌ప్ప‌... ఉప్పెన లో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపిస్తున్న మైన‌స్సులు ప్ల‌స్సులవ్వ‌వు. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ: 'క్రాక్' సినిమాకీ గొడ‌వ మొద‌లైంది.