ENGLISH

గ్లామ్‌షాట్‌: రెడ్‌ హాట్‌ 'లవ్‌లీ' బట్‌ 'హేట్‌' దిస్‌.!

09 January 2019-15:30 PM

లవ్‌ సింబల్‌ డీప్‌ నెక్‌ రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో ధగ ధగలాడిపోతున్న ఈ ముద్దుగుమ్మని లైక్‌ చేయని వారెవరుంటారులెండి. పేరు ఊర్వశీ రౌతెల్లా. 'హేట్‌ స్టోరీ 4' లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో తన అందచందాలతో పాటు, పవర్‌ ఫుల్‌ పర్‌ఫామెన్స్‌తోనూ ఆట్టుకుంది. అందుకే కుర్రకారు గుండెల్లో హేట్‌ బ్యూటీగా లవ్‌లీ ప్లేస్‌ని ఆక్యుపై చేసేసింది.

 

చూపు తిప్పుకోని అందమే కాదు, విచ్చలవిడి అందాల ఆరబోతకూ మొహమాటం లేదీ ముద్దుగుమ్మకి. అయితే బాలీవుడ్‌కి మాత్రమే అమ్మడి అందాలు పరిమితమైపోయాయి. ఓ బెంగాలీ మూవీలో ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఒక కన్నడ మూవీలో నటించింది కానీ, అంత పాపులర్‌ కాలేదు. హిందీలో హృతిక్‌ రోషన్‌తో 'కాబిల్‌' మూవీలో ఐటెం స్టెప్పులేసింది. స్వతహాగా మోడల్‌.

 

అంతేకాదు, అందాల పోటీ నుండి ఆరంగేట్రం చేసింది. కాబట్టి, ఎక్స్‌పోజింగ్‌కి ఏమాత్రం వెనుకాడదు. అయితే అవకాశాలు మాత్రం తక్కువే అమ్మడికి. చాలా అరుదుగా ఇలా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటుంది. అలా దొరికిన ఫోటోనే ఇది. రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌కి ఆ లవ్‌ సింబల్‌ నెక్‌ స్పెషల్‌ గ్లామర్‌ తెచ్చి పెట్టింది. 

ALSO READ: 'కైరా' కంట నీరు పెట్టించిన ప్రముఖ టీవీ ఛానల్..!

ALSO READ: Urvashi Rautela Photo Gallery