ENGLISH

అమెరికాలో `వ‌కీల్ సాబ్` ప్ర‌భంజ‌నం

10 April 2021-09:35 AM

పింక్ కి రీమేక్ గా వ‌చ్చిన సినిమా `వ‌కీల్ సాబ్`. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకి పాజిటీవ్ రివ్యూలు వ‌చ్చాయి. ప‌వ‌న్ ఫ్యాన్స్ అయితే పండ‌గ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. అమెరికాలో అయితే... వ‌కీల్ సాబ్ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ప్రీమియ‌ర్ షోల ద్వారా ఏకంగా 296 వేల డాల‌ర్లు సంపాదించింది. అంటే దాదాపుగా 2 కోట్ల పైమాటే. అమెరికాలో ఆంక్ష‌లు విప‌రీతంగా ఉన్నాయి. స‌గం థియేట‌ర్లు మూసేశారు.

 

ఈ స‌మ‌యంలోనూ ఈ స్థాయిలో వ‌సూళ్లు ద‌క్కించుకుందంటే అది క‌చ్చితంగా ప‌వ‌న్ స్టామినా ద్వారానే. పైగా `పింక్` సినిమాని ఓవ‌ర్సీస్‌లో చూసేశారు. అయినా స‌రే, వాళ్లు `వ‌కీల్ సాబ్`ని ఆదరిస్తున్నారు. ఈ వీకెండ్ అంతా అమెరికాలో వ‌కీల్ సాబ్‌.. సుడిగాలి వ‌సూళ్లు చేయ‌డం ఖాయం. క‌రోనా త‌ర‌వాత‌.. పెద్ద సినిమాలొచ్చినా.. యూఎస్ వ‌సూళ్లు మాత్రం లేవు. వ‌కీల్ సాబ్ తో అక్క‌డ మ‌ళ్లీ కళ వ‌చ్చిన‌ట్టైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త సినిమాల రికార్డుల‌న్నీ వ‌కీల్ సాబ్ బ‌ద్ద‌లు కొట్టే ఛాన్సుంద‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల ఉవాచ‌.

ALSO READ: 'వకీల్ సాబ్' మూవీ రివ్యూ & రేటింగ్!