ENGLISH

రాశీఖన్నాతో వరుణ్‌తేజ్‌ లిప్‌లాక్‌?

02 February 2018-14:21 PM

మెగా రాకుమారుడు వరుణ్‌తేజకి, అందాల భామ రాశీఖన్నాకీ మధ్య లిప్‌లాక్‌ సీన్‌ ఉందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'తొలిప్రేమ'. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. 

ట్రైలర్‌ చూస్తుంటే, ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లానే ఉంది. వరుణ్‌, రాశీఖన్నా జంట ఆకట్టుకుంటోంది. డైలాగులు కూడా చాలా బాగున్నాయి ట్రైలర్‌లో. 'జ్ఞాపకాలు మంచివైనా..చెడ్డవైనా.. ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మోయక తప్పదు..' అని వరుణ్‌ చెబుతోన్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. అలాగే రైల్‌ సీన్‌లో వరుణ్‌, రాశీఖన్నా మధ్య కెమిస్ట్రీ ఒక రకంగా ఉంటే, ట్రైలర్‌ లాస్ట్‌లో కారులో కిస్సింగ్‌ సీన్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. 

ట్రైలర్‌లో కిస్‌ సీన్‌ చూపించలేదు. కావాలనే కట్‌ చేసి ఉంటారు. అయితే సినిమాలో ఈ సీను హీరో, హీరోయిన్స్‌ మధ్య హాట్‌ హాట్‌ లిప్‌లాక్‌ సీన్‌ అనీ అంటున్నారు. అయితే రాశీఖన్నాకి లిప్‌లాక్స్‌ కొత్తేమీ కాదు. ఆల్రెడీ 'జిల్‌' సినిమాలో గోపీచంద్‌తో లిప్‌లాక్‌ సీన్‌లో నటించేసింది. ఇదే కాకా ఇంకా పలు సినిమాల్లో అమ్మడు హాట్‌ హాట్‌ లిప్‌లాక్స్‌లో కనిపించింది. కానీ ఈ సినిమాలో మెగా ప్రిన్స్‌కీ, రాశీఖన్నాకి మధ్య లిప్‌లాక్‌ సీన్‌ చాలా రొమాంటిక్‌గా, డిఫరెంట్‌ ఫీల్‌ కలిగించేలా ఉంటుందట. ఈ సీన్‌ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

 

మొత్తానికి ఇంట్రెస్టింగ్‌ లిప్‌ సీన్‌తో ట్రైలర్‌ని ఎండ్‌ చేసి, సినిమాపై అంచనాలు పెంచేశారు. 'హమ్మయ్యా పెట్టేశాను.. అని వరుణ్‌ అంటే, ఎప్పుడు? ఎక్కడ? అని రాశీఖన్నా ఇచ్చే ఎక్స్‌ప్రెసివ్‌గా అడగడం, ట్రైలర్‌ చూసిన ఆడియన్స్‌కీ అదే అనుమానం కలిగేలా చేసింది. ఇంతకీ వరుణ్‌ రాశీకి ముద్దు పెట్టాడా లేదా? ఇదే డైలామా మరో వారం రోజుల పాటు కొనసాగించాల్సిందే. ఎందుకంటే ఫిబ్రవరి 10న కదా 'తొలిప్రేమ' ప్రేక్షకుల ముందుకొచ్చేది..!

ALSO READ: Qlik Here For The Tholi Prema Movie Trailer