ENGLISH

వీరసింహాలో ఆరు పాటలు

10 January 2023-09:18 AM

నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, జై బాలయ్య, సుగుణ సుందరి, బావ మనోభావాలు పాటలు మాస్ ని అలరించాయి. ఇప్పుడు మాస్ మొగుడు పాట కూడా బయటికి వచ్చింది. టైటిల్ కి తగ్గట్టు ఇదీ మాస్ పాటే. బాలయ్య ఫ్యాన్స్ కి పండగ లాంటి పాటే. పాటలో డ్యాన్సులు బావున్నాయి. ఈ నాలుగే కాదు ఇందులో మరో రెండు పాటలు కూడ వున్నాయి. అవి బిట్ సాంగ్స్ లా వస్తాయి. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పారు.

 

''తమన్ ఎక్స్ ట్రార్డినరీ సాంగ్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఇప్పుడు విన్న పాటలే కాకుండా బ్యాగ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ రెండు వున్నాయి. అవి ఇంకా ఎక్స్ ట్రార్డినరీ గా వుంటాయి. మాస్ మొగుడు చివర్లో తీసిన పాట. రన్ టైం లో ఈ పాట వచ్చినపుడు మాములుగా వుండదు. ఈ సినిమాకి చాలా సక్సెస్ మీట్లు వుంటాయి. వీరసింహారెడ్డి ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. రాసిపెట్టుకోండి' అని చెప్పుకొచ్చారు గోపీచంద్ మలినేని.