ENGLISH

రీమేక్ కి నో చెప్పేసిన వెంకీ

26 September 2017-18:58 PM

రీమేక్ సినిమాలకి కేర్ అఫ్ అడ్రస్ గా పిలవబడే హీరో విక్టరీ వెంకటేష్. ఈ మధ్యనే ఆయన చేసిన గురు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఒక యావరేజ్ చిత్రంగా నిలిచింది.

ఇక ఈ తరుణంలో ఆయన సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రాన్ని తెలుగులో చేయనున్నాడు అన్న టాక్ వినపడుతూ వస్తున్నది. దీనితో అందరు ఈ చిత్రాన్ని వెంకీ ఎప్పుడు మొదలుపెడతాడా అన్న ఆత్రుతగా ఎదురుచూసారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం, వెంకీ ప్రస్తుతం సుల్తాన్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన పక్కన పెట్టేసినట్టు తెలిసింది. తను తరువాత చేసేది స్ట్రెయిట్ చిత్రమే అని ఆయన సన్నిహిత వర్గాల మాట.

మరి ఎటువంటి చిత్రం చేయనున్నాడో అన్నది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

 

ALSO READ: మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..