ENGLISH

విక్రమ్ స్టయిల్ లో వెంకీ సైంధవ్‌ !

26 January 2023-12:09 PM

వెంకటేష్‌ ఇప్పుడు యాక్షన్‌ ఎంటర్ టైనర్ కి రెడీ అయ్యారు. ‘హిట్‌’ లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘‘సైంధవ్‌’’ అనే పేరును ఖరారు చేశారు. గ్లింప్స్ వీడియో కూడా వదిలారు. వెంకటేష్‌ గన్‌ పట్టుకుని కనిపిస్తూ ‘నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..’’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పారు.

 

ఈ వీడియోలో చాలా డిటేయిల్స్ వున్నాయి. ఒక మెడిసన్ వైల్, పెద్ద మిషన్ గన్, డ్రగ్స్ .. డార్క్ థీమ్ ఇవన్నీ ఈ గ్లింప్స్ లో కనిపించాయి. కమల్ హాసన్ విక్రమ్ తరహాలో శైలేష్ ఒక కథని రెడీ చేశాడని గతంలో వార్తలు వచ్చాయి. సైంధవ్‌’ గ్లింప్స్ చూస్తుంటే.. విక్రమ్ లానే ఒక డార్క్ మూవీ ని రెడీ చేస్తున్నారని అర్ధమౌతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఇందులో కనిపించే అవకాశం వుంది.