ENGLISH

రాజమౌళిపై సుక్కు అభిమానం.. అదరహో

26 January 2023-11:13 AM

రాజమౌళి అందరికీ నచ్చే దర్శకుడు. ఆయనకు దర్శకుల్లో కూడా వీర అభిమానులు వున్నారు. రాజమౌళిని అమితంగా ఇష్టపడే వారిలో సుకుమార్ ఒకరు. నిజానికి సుకుమార్ అంటే రాజమౌళి కూడా ఇష్టం. సుకుమార్ తీసిన జగడం రాజమౌళి చాలా ఇష్టం. తర్వాత సుకుమార్ నుండి ఎప్పుడు సినిమా వచ్చిన తన వంతుగా ప్రచారానికి వస్తారు రాజమౌళి. వన్ సినిమాని అందరూ విమర్శించినా.. అందులో టెక్నికల్ బ్రిలియన్స్ రాజమౌళి చాలా నచ్చంది. దీనిపై ఒక వీడియో కూడా చేశారు. అలాగే సుకుమార్ కూడా రాజమౌళి పై ప్రేమని చాలా సందర్భాల్లో వ్యక్తం చేస్తుంటారు.

 

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోని ‘నాటు నాటు’ పాట ప్రఖ్యాత ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళికి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు సుకుమార్‌. ఓ మీటింగ్‌ రూమ్‌లో తన బృందంతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీ గురించి వివరించారు. ‘‘ఇన్నాళ్లూ నా టీంతో జరిపిన చర్చలు, సమావేశాల్లో ప్రిన్సిపల్‌ కుర్చీని ఖాళీగా వదిలేశా. నేనెందుకు అలా చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. రాజమౌళి సర్‌ ఇది మీ కోసమే. ఈ కుర్చీ ఎప్పటికీ మీదే’’ అంటూ సుకుమార్‌.. రాజమౌళిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలౌతుంది.