ENGLISH

'వెంకీ మామ' అప్‌డేట్‌ ఎప్పుడంటే!

12 July 2019-13:00 PM

ఈ మధ్య విక్టరీ వెంకటేష్‌ చిన్న సినిమాలను ఎంకరేజ్‌ చేస్తూ, ఆయా చిన్న సినిమాల అప్‌డేట్స్‌ అందించడంలో ఉత్సాహం చూపిస్తున్నారు. పలు సినిమాలకు టీజర్‌లు, ట్రైలర్‌లు లాంఛ్‌ చేస్తూ ఆ సినిమాలకు తన కారణంగా సరికొత్త క్రేజ్‌ తెచ్చిపెడుతున్నారు. తాజాగా 'మిస్‌మ్యాచ్‌' అనే సినిమాకి వెంకటేష్‌ టీజర్‌ లాంఛ్‌ చేసిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాల అప్‌డేట్‌ లాంచింగ్‌ సంగతి సరే.

 

కానీ, ఆయన సినిమా 'వెంకీ మామ' సంగతేంటంటా.? అని ఫ్యాన్స్‌ అడుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌ 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వెంకటేష్‌, నాగచైతన్య కాంబినేషన్‌లో మల్టీ స్టారర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోంది. చైతూతో రాశీఖన్నా జత కడుతోంది. ఇంతవరకే ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు.

 

కానీ, కొంచెం కొత్తగా కావాలి కదా.. ఆ కొత్తదనం కోసమే ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక ఎక్కువ కాలం వెయిట్‌ చేయించడం వెంకీకి కూడా ఇష్టం లేదట. సో త్వరలోనే వెంకీ మామ అప్‌డేట్‌ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలోనే అందుకు మంచి ముహూర్తం ఫిక్స్‌ చేయనున్నారట. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా 'వెంకీ మామ'ను రూపొందిస్తున్నారు.

ALSO READ: అమలాపాల్‌ 'న్యూడ్‌' సీక్రెట్‌ విప్పేసింది!