పవన్ కల్యాణ్‌ని `వకీల్ సాబ్`గా చూపించి.. హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్. అయితే... అంత మంచి కమర్షియల్ హిట్టు తరవాత కూడా వేణు శ్రీరామ్ ఖాళీగా ఉండిపోయాడు. బన్నీతో ఐకాన్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు కూడా ముందుకు కదల్లేదు. నానితోనే ఓ సినిమా చేస్తాడని కూడా అన్నారు. అదీ అవ్వలేదు. చివరికి నితిన్ తో సినిమా ఓకే చేయించుకొన్నాడు వేణు శ్రీరామ్.
ఇటీవల నితిన్‌ని కలిసిన వేణు శ్రీరామ్ ఓ కథ చెప్పాడని, అది నితిన్‌కి నచ్చి ఓకే చేశాడని టాక్. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. నితిన్ ఇప్పుడు ఫుల్ బిజీలో ఉన్నాడు. వక్కంతం వంశీ సినిమా ఒకటి పట్టాలెక్కించాడు. వెంకీ కుడుముల కథనీ త్వరలోనే పట్టాలెక్కించబోతున్నాడు. ఇవి రెండూ పూర్తయ్యాకే.. వేణు శ్రీరామ్ సినిమా మొదలవుతుంది.