ENGLISH

రౌడీ‌తో బోయ‌పాటి?

19 October 2020-11:24 AM

టాలీవుడ్ లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్‌కి రంగం సిద్ధం అవుతోందా? యువ సంచ‌న‌లం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ఓ సినిమా చేయ‌బోతున్నాడా? ఆ అవ‌కాశాలున్నాయంటోంది టాలీవుడ్. దిల్ రాజు బ్యాన‌ర్ లో బోయ‌పాటి శ్రీ‌ను ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు. అదే దిల్ రాజు... విజ‌య్ దేవ‌ర‌కొండ చేతికీ అడ్వాన్సులు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ ఇద్ద‌రి కాంబోలో ఓసినిమా సెట్ చేయాలన్న‌ది దిల్ రాజు వ్యూహం గా క‌నిపిస్తోంది.

 

విజయ్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక‌లాంటి సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. మాస్‌, యాక్ష‌న్ క‌థ‌లేవీ ఎంచుకోలేదు. తొలిసారి అలాంటి క‌థ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. అందుకు త‌గిన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నునే అని అంద‌రి న‌మ్మ‌కం.

 

అందుకే ఈ కాంబో కుదిరే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు బోయ‌పాటి. విజ‌య్ చేతిలోనూ చాలా ప్రాజెక్టులున్నాయి. అవి అయ్యాకే.. ఈ కాంబో లో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.

ALSO READ: కీర్తి సురేష్‌, ఇమేజ్‌ పూర్తిగా మార్చేయనున్న ‘సర్కారు’