ENGLISH

మహేష్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన కామ్రేడ్‌!

02 May 2019-13:00 PM

సెలబ్రిటీస్‌ని అభిమానులు 'గారు' అని గౌరవించుకోకపోవడం కామనే. దీన్ని తప్పు పట్టడానికి లేదు. తమకు వారిపై అభిమానాన్ని ఓన్‌ చేసుకోవడంగా భావించాలి ఈ అంశాన్ని. కానీ నిజంగా తమ అభిమాన నటీ నటులు ఎదురు పడితే, సార్‌ అని గౌరవించడం మర్యాద కావచ్చు. ఫార్మాలిటీ కావచ్చు. ఇంకేదైనా కావచ్చు అప్పుడు మాత్రం మర్యాదను మర్చిపోకూడదు. గారు అనకపోయినా, అన్నా, అనో, ఇంకేమైనా వరసతోనో సంబోధిస్తుంటారు.

రాజకీయ నాయకులకీ ఈ నియమం వర్తిస్తుంది. సాధారణ వ్యక్తులు ఇద్దరు మాట్లాడుకునే సమయంలో రాష్ట్రానికి సీఎం అయినా 'చంద్రబాబు' అనే సంబోధించుకుంటారు. కానీ అదే చంద్రబాబు గురించి మీడియా ముఖంగానో, లేక ఎదురుపడి మాట్లాడాల్సి వచ్చినప్పుడో గారు అని సంబోధించక తప్పదు. కానీ విజయ్‌ దేవరకొండ రూటే సెపరేటు. ఆయన హీరో కాకముందు మహేష్‌బాబు సినిమా టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిలబడిన చాలా బ్యాడ్‌ సందర్భాలున్నాయట.

 

అయితే ఇప్పుడు ఆయన రేంజే వేరు. ఏకంగా మహేష్‌ పక్కన కూర్చున్నాడు. మహేష్‌ నిలబడిన వేదికపై ఆయన కూడా మాట్లాడే అవకాశం దక్కించుకున్నాడు. అయితే, ఆ సభా వేదికపై స్పీచ్‌లో భాగంగా మహేష్‌ని 'సార్‌'అని సంబోధించలేను అని చెప్పి, అందరికీ షాకిచ్చాడు విజయ్‌ దేవరకొండ. ఇక్కడ కూడా ఆటిట్యూడ్‌ ప్రదర్శించాడనుకోవాలా ఆటిట్యూడ్‌ అనే మాటకి కొత్తర్ధం చెప్పిన వ్యక్తి విజయ్‌ దేవరకొండ. ఆ ఆటిట్యూడ్‌తోనే ఆయన సంచలన హీరో అయిపోయాడు. ఆ ఆటిట్యూడ్‌కి మెచ్చే అభిమానులు 'రౌడీ' అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన్ని. ఆయన ఫాలోవర్స్‌ కూడా 'రౌడీసే' మరి. ఏది ఏమైనా మరోసారి విజయ్‌ దేవరకొండ ఐ యామ్‌ ది స్పెషల్‌ అనిపించుకున్నాడు. త్వరలోనే 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో రాబోతున్నాడు విజయ్‌ దేవరకొండ.

ALSO READ: 'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్స్‌ పోటెత్తాయి.!