ENGLISH

ఐస్ క్రీం.. ఐస్ క్రీం.. అంటున్న విజయ్

09 May 2018-13:05 PM

అర్జున్ రెడ్డి తో యావత్ తెలుగు సినీ అభిమానులని తనవైపుకి తిప్పేసుకున్న నవతరం స్టార్ హీరో విజయ్ దేవరకొండ. 

ఇక ఈరోజు ఆయనకేంతో ప్రత్యేకంగా మారిపోయింది. దానికి కారణం- ఆయన పుట్టినరోజుతో పాటుగా మహానటి చిత్రం విడుదలవుతుండడం కూడా.. ఈ తరుణంలో ఆయన తన ఆనందాన్ని హైదరాబాద్ లో ఉన్న ప్రతిఒక్కరితో పంచుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఒక మూడు ఐస్ క్రీం ట్రక్కులని హైదరాబాద్ నగరంలోకి పంపించాడు. ఈ మూడు ఐస్ క్రీం ట్రక్కులు హైదరాబాద్ నగరమంతా తిరుగుతూ సామన్య ప్రజలందరికి ఐస్ క్రీంని ఉచితంగా ఇస్తాయి.

అసలే వేసవి తాపానికి అల్లాడిపోతున్న ప్రజలకి ఇలా చల్లటి ఐస్ క్రీంని ఇస్తుండడంతో విజయ్ పుట్టినరోజుని ఎవ్వరు మరిచిపోలేరు. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఇలాంటి వైవిధ్యమైన అంశాలతో సామాన్య ప్రజల్లో తనకంటూ ఒక ముద్రని వేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇలాగే మొన్న కొంత మంది హాస్టల్ విద్యార్థులకి కూడా స్నాక్స్ పంపించి వారి మనసులని సైతం గెలుచుకున్నాడు. ఏదేమైనా తన పుట్టినరోజు నాడు చల్ల చల్లటి ఐస్ క్రీంలతో అందరిని చల్ల బరుస్తున్నాడు.