ENGLISH

విజ‌య్‌తో వంశీ పైప‌డిల్లి?

27 March 2021-16:06 PM

మ‌హ‌ర్షి లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా అందించిన ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఆ సినిమాకి రెండు జాతీయ అవార్డులు కూడా వ‌చ్చాయి. అయితే.. మ‌హ‌ర్షి త‌ర‌వాత పూర్తిగా ఖాళీ అయిపోయాడు వంశీ. మ‌హేష్ బాబుతో మ‌రో సినిమా చేయాల‌ని అనుకున్నా వ‌ర్క‌వుట్ కాలేదు. హీరోలెవ‌రూ ఖాళీగా లేక‌పోవ‌డంతో.. వంశీ చేతిలో సినిమా లేకుండా పోయింది.

 

అయితే ఈలోగా... కొంత‌మంది హీరోల్ని సంప్ర‌దించాడు వంశీ. అయితే... ఏ ఒక్క‌రూ వంశీతో సినిమా చేయ‌డానికి స‌ముఖంగా లేరు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ చుట్టూ తిరుగుతున్నాడ‌ని టాక్‌. విజ‌య్ కి ఓ క‌థ చెప్పాడ‌ని, విజ‌య్ కూడా.. వంశీతో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడ‌ని తెలుస్తోంది. అయితే.. విజ‌య్ ఓకే అన్నా.. ఈ ప్రాజెక్టు అంత తొంద‌ర‌గా ప‌ట్టాలెక్క‌దు. ఎందుకంటే రౌడీ చేతిలో చాలా సినిమాలున్నాయి. ముందు లైగ‌ర్ పూర్త‌వ్వాలి. ఆ త‌ర‌వాత ఒక‌ట్రెండు క‌మిట్‌మెంట్స్ ఉన్నాయి. ఇవ‌న్నీ అయ్యేస‌రికి మ‌రో రెండేళ్ల‌యినా ప‌డుతుంది.

ALSO READ: వేదం నాగ‌య్య‌... క‌న్నుమూత‌