ENGLISH

రష్మికతో అఫైర్‌: 'రౌడీ' ఏమన్నాడంటే.!

19 July 2019-16:00 PM

రష్మికా మందన్నాతో విజయ్‌ దేవరకొండ లవ్‌లో ఉన్నాడంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. రౌడీతో అఫైర్‌ కారణంగానే రష్మికా రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ కూడా రద్దు చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా 'డియర్‌ కామ్రేడ్‌' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రౌడీ తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కాస్త ఎమోషనల్‌గా రెస్పాండ్‌ అయ్యాడు. డైరెక్ట్‌గా కాకుండా, ఇన్‌డైరెక్ట్‌గా రష్మికకు, తనకూ మధ్య ఎలాంటి అఫైర్‌ లేదని ప్రూవ్‌ చేసే ప్రయత్నం చేశాడు.

 

'డియర్‌ కామ్రేడ్‌'లో విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్నా మధ్య రొమాన్స్‌ పండే క్రమంలో విచ్చల విడిగా లిప్‌లాక్స్‌ ఉన్నాయి. ఆ విషయమే రౌడీ ప్రస్థావించాడు. నిజానికి లిప్‌లాక్‌ సీన్స్‌లో నటించాలంటే తామెంతో కష్టపడతామనీ, ఆ సీన్స్‌ వల్ల తమ తమ వ్యక్తిగత జీవితాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయనీ, ఆ టైప్‌ సీన్స్‌లో నటించిన తర్వాత పర్సనల్‌గా కొన్ని అసభ్యకరమైన కామెంట్స్‌ వినాల్సి వస్తోందనీ, వాటన్నింటినీ భరించి, మేము ఆ సీన్స్‌లో ఎందుకు నటిస్తున్నామంటే.. 'మీ కోసం..' అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి రౌడీ క్లారిటీ ఇచ్చాడు. ఆర్టిస్టులుగా మమ్మల్ని నమ్ముకుని సినిమా కోసం డబ్బులు పెట్టిన నిర్మాతలు, డైరెక్టర్‌ భవిష్యత్తు, లైట్‌ బోయ్‌ దగ్గర నుండీ, చాలా మంది టెక్నికల్‌ టీమ్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనీ, వారందరినీ సేవ్‌ చేయాలంటే, అలాంటి సీన్స్‌లో నటించక తప్పడం లేదన్నాడు.

 

ఆ సీన్స్‌ ఉంటేనే ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేయగలుగుతున్నాం. ఆడియన్స్‌ ఆదరిస్తేనే సినిమా హిట్‌ అవుతుంది. హిట్‌ అయితేనే, దాన్ని నమ్ముకున్న టెక్నీషియన్స్‌కి భవిష్యత్తు ఉంటుంది.. అంటూ ముద్దుకున్న లాజిక్‌ని చైన్‌ ప్యాటర్న్‌లో రౌడీ భలే వివరించాడులే. విజయ్‌, రష్మికా జంటగా తెరకెక్కిన 'డియర్‌ కామ్రేడ్‌' ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ALSO READ: Dear Comrade - Comrade Anthem Song Telugu