ENGLISH

సినీ నిర్మాత పై కాల్పులు!

28 July 2017-12:18 PM

సినీ, రాజకీయ ప్రముఖుడైన విక్రమ్ గౌడ్ పైన జరిగిన హత్యా ప్రయత్నం వార్త ఇప్పుడు భాగ్యనగరంలో హల్చల్ చేస్తుంది.

వివరాల్లోకి వెళితే, ఫిలిం నగర్ ప్రాంతంలోని ఆయన నివాసంలో ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన పై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నది. అయితే ఆ సమయంలో ఎవరు ఇంటిలోకి వచ్చి కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

ఈ కాల్పుల్లో ఆయన పక్కటెముకలకి, రెండు చేతులకి తీవ్రమైన గాయాలు అయినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి. విక్రమ్ గౌడ్ నితిన్ హీరో గా గుండెజారి గల్లంతయిందే చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు.

ఈయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ALSO READ: 'సిట్‌' ముందు హాజరైన మాస్‌ మహరాజ్‌