ENGLISH

'వినరో భాగ్యము విష్ణుకథ' మూవీ రివ్యూ & రేటింగ్!

18 February 2023-12:55 PM

నటీనటులు: కిరణ్ అబ్బవరం, క‌శ్మీరా ప‌ర్ధేశీ, మురళీ శర్మ తదితరులు
దర్శకుడు : మురళీ కిషోర్ అబ్బూరు
నిర్మాతలు: బన్నీ వాస్
సంగీత దర్శకులు: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: డేనియల్ విశ్వాస్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్


రేటింగ్ : 2.5/5


‘ఎస్ఆర్ కల్యాణమండపం’ తర్వాత కిరణ్ అబ్బవరంకు మరో చెప్పుకోదగ్గ విజయం లేదు. కొన్ని సినిమాలు చేశాడు కానీ అవి సరిగ్గా వర్క్ అవుట్ కాలేదు. అయితే కొత్త దర్శకుడు కిషోర్ తో చేసిన  "వినరో భాగ్యము విష్ణుకథ" ట్రైలర్ మాత్రం సినిమా పై ఆసక్తిని పెంచింది. గీతా ఆర్ట్స్ కూడా తోడవ్వడంతో విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరా అంచనాలని విష్ణు కథ అందుకుందా ? కిరణ్ కి మరో విజయం దక్కిందా ? 


కథ:


విష్ణు (కిరణ్‌ అబ్బవరం) తిరుపతి కుర్రాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత (శుభలేఖ సుధాకర్‌) పెంపకంలో పెరుగుతాడు. ఎదుటివారికి సాయం చేసే గుణం వున్న విష్ణు జీవితంలోకి నైబర్‌ నంబర్‌ అనే కాన్సెప్ట్‌తో దర్శన (కాశ్మీర పరదేశి) వస్తుంది. దర్శన ఒక యూట్యూబర్‌. ట్రెండింగ్‌ వీడియోలు చేసి సెలెబ్రిటీ అయిపోవాలనుకుంటుంది. అందులో భాగంగా నైబర్‌ నంబర కాన్సెప్ట్‌తో వీడియో చేయాలనుకుంటుంది. తన ముబైల్‌ నంబర్‌లోని చివరి అంకెకు అటు, ఇటు ఉండే నంబర్లతో ఫోన్‌ చేయగా.. ఒకవైపు విష్ణు,మరోవైపు శర్మ(మురళీ శర్మ) పరిచయం అవుతారు. కలసి వీడియోలు చేస్తారు. ఈ క్రమంలోనే విష్ణు, శ‌ర్మ ఇద్దరూ ద‌ర్శన‌ను ప్రేమిస్తారు. అయితే ఆమె ఓరోజు శ‌ర్మతో క‌లిసి లైవ్ మ‌ర్డర్ అనే ప్రాంక్ వీడియో చేస్తుంది. అయితే శ‌ర్మ నిజంగానే ద‌ర్శన పేల్చిన తూటా తగిలి ప్రాణాలు కోలోపోతాడు. దీంతో ఆ మర్డర్ కేసులో ద‌ర్శన జైలు పాల‌వుతుంది. మ‌రి ఈ కేసు నుంచి దర్సనని  బయటకి తీసుకురావడానికి విష్ణు ఏం చేశాడు? శ‌ర్మను ద‌ర్శన నిజంగానే హ‌త్య చేసిందా? ప్రాంక్ ఎలా బెడిసికోటింది ? దిని వెనుక ఎవరు వున్నారు ? అనేది మిగతా కథ.


విశ్లేషణ : 


మన మొబైల్‌ నంబర్‌ నుంచి పక్క నంబర్‌కి కాల్‌ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో నైబర్ నెంబర్ అంటూ ఒక కాన్సెప్ట్ ని రాసుకొని ప్రేమ కామెడీ సస్పెన్స్ థ్రిల్ దేశభక్తి ఇలా ఎన్నో ఎలిమెంట్స్ జోడించి తీసిన కథ ఇది. గ్యాంగ్‌స్టర్‌ రాజ‌న్ కోణం నుంచి క‌థ‌ను ప్రారంభించిన తీరు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. రాజన్ దగ్గరికి విష్ణు వచ్చి తన కథ చెప్పుకోవడం పాత్రల పరిచయాలు శర్మ, దర్శన యూట్యూబ్ పాటలు సరదాగా సాగిపోతాయి. అయితే తర్వాత కథ ఎంతకీ ముందుకు కదలదు. విరామం వరకూ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. 


ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచుతుంది.  ద్వితీయార్ధం పూర్తిగా థ్రిల్లర్ మూడ్‌లో న‌డుస్తుంది. అయితే ఇందులో కొన్ని మ‌లుపులు ఆస‌క్తిరేకెత్తిస్తే.. మ‌రికొన్ని సిల్లీగా ఉనాయి. శ‌ర్మ హ‌త్య వెన‌కున్న చిక్కుముడుల‌ను విప్పే తీరు బాగుంది. దర్శకుడు అనుకున్న నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్‌ మాత్రం తేలిపోయింది. కైమాక్స్  దేశ‌భ‌క్తి కోణం కూడా కథలోకి వస్తుంది. కథకు సంబంధం లేకుండా భారీ డైలాగులు చెప్పి అప్పటి వరకూ బలంగా చూపించిన రాజన్ పాత్రని బపూన్ గా చూపించి శుభం కార్డు వేస్తాడు దర్శకుడు. అన్నట్టు దీనికి సీక్వెల్ కూడా వున్నట్లు హింట్ ఇచ్చారు  


నటీనటులు : 


విష్ణు పాత్రకు కిరణ్ న్యాయం చేశాడు. తన పాత్ర కూల్ గా అదే సమయంలో హుషారుగా వుంటుంది. భారీ ఫైట్లు కూడా చేశాడు. దర్శన పాత్రలో చేసిన కాశ్మీరా ఓకే అనిపిస్తుంది. అమెది కథలో కీలకమైన పాత్రే. మురళీ శర్మ పాత్రలో మంచి ట్విస్ట్ వుంది. ఆ పాత్రకు తగిన న్యాయం చేశారు.


విష్ణు తాత‌గా శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజ‌న్‌గా శ‌ర‌త్ ఓకే అనిపిస్తారు.  ఎల్‌.బి.శ్రీరామ్‌, దేవి ప్రసాద్, ఆమ‌ని వంటి సీనియ‌ర్ ఆర్టిస్ట్‌లు కనిపిస్తారు కానీ వాళ్ళవి రెండు రెండు డైలాగుల పాత్రలే. 


టెక్నికల్ :


పాటలు బావున్నాయి. తిరుపతి లో చిత్రీకరించిన పాట కలర్ ఫుల్ గా వుంది. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. డేనియ‌ల్ కెమెరా వ‌ర్క్ బాగుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. 


అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటూ ప్రేక్షకులని ఎంగేజ్ చేయడం లక్ష్యంగా ఈ సినిమాని తీశాడు దర్శకుడు. అయితే ఈ ప్రయత్నం యావరేజ్ దగ్గర ఆగిపోయింది. 


ప్లస్ పాయింట్స్


కిరణ్ అబ్బవరం 
ట్విస్ట్ లు 
సంగీతం 


మైనస్ పాయిన్స్


ఫస్ట్ హాఫ్ 
లాజిక్ లేకపోవడం 
నెంబర్ నైబర్ కాన్సెప్ట్ తేలిపోవడం


ఫైనల్ వర్దిక్ట్ : విష్ణు చెప్పిన యావరేజ్ కథ!