ENGLISH

జగన్‌ డేట్స్‌ కోసం 'యాత్ర' టీమ్‌ వెయిటింగ్‌.!

26 January 2019-08:30 AM

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'యాత్ర' జగన్‌ డేట్స్‌ కోసం ఎదురు చూస్తోందట. అదేంటీ.? సినిమా రిలీజ్‌కి దగ్గర పడింది. సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు జగన్‌ డేట్స్‌ ఏంటీ.? అసలు జగన్‌ పాత్రే ఈ సినిమాలో లేదన్నారు కదా.. అనుకుంటున్నారా.? అవునండీ మీ అనుమానాలన్నీ నిజమే. 'యాత్ర' ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

అయితే ఏ సినిమాకైనా ప్రమోషన్స్‌ ముఖ్యం కదా. సినిమా సక్సెస్‌లో ప్రమోషన్స్‌ కీలక పాత్ర వహిస్తాయి ఇది సినీ ప్రేక్షకులెరిగిన సత్యం. అందుకే 'యాత్ర' ప్రమోషన్స్‌లో భాగంగా ఘనంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా జగన్‌ని ఆహ్వానించారట. జగన్‌ డేట్స్‌ కోసం ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని హోల్డ్‌లో పెట్టిందట చిత్ర యూనిట్‌. 

 

బహుశా ఈ నెలాఖరుకు కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ ఫంక్షన్‌ నిర్వహించనున్నారనీ తెలుస్తోంది. జగన్‌ ఇంతవరకూ ఇలాంటి సినీ ఫంక్షన్స్‌కి హాజరైంది లేదు. ఎంతైనా తండ్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కదా ఈ సినిమా కోసం జగన్‌ వస్తాడని భావిస్తున్నారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఫెయిల్యూర్‌ కావడంతో, 'యాత్ర' బయోపిక్‌పై ఆశక్తి పెరిగింది. 

 

మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ ముమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. 

ALSO READ: 'సూర్య‌కాంతం' మూవీ టీజ‌ర్ రివ్యూ